పులిపాటి నరసింహారావుకు ఘన నివాళులు
-డాక్టర్ పులిపాటి ప్రసాద్ కు పరామర్శ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి పులిపాటి నరసింహారావు అకాల మరణం బాధాకరమని ఖమ్మం నగర మేయర్ పునుకోల్లు నీరజ సుడా ఛైర్మెన్ బచ్చువిజయ్ కుమార్ మంత్రి పిఏ చిరుమామిళ్ళ రవి కిరణ్అన్నారు.బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పులిపాటి ప్రసాద్ నివాసంలో కీర్తిశేషులు పులిపాటి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నరసింహారావు ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుడిని ప్రార్థించారు.అనంతరం పులిపాటి ప్రసాద్ ని పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ ల పరామర్శ
డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి మృతి తో జర్నలిస్ట్ లు పులిపాటి నరసింహారావు చిత్ర పటానికి నివాళులు అర్పించి పులిపాటి ప్రసాద్ ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో షేక్ జానీ పాషా(రూలింగ్ 1 టీవీ) సయ్యద్ ఖాసీం(అక్షిత) మేడి రమేష్ (సూర్య) కె వెంకటేశ్వర్లు (వి5) మధార్ సాహెబ్ (పీపుల్స్ న్యూస్ )తదితురులు ఉన్నారు.