నేటి నుండి జాలపల్లిలో కంటి వెలుగు వైద్య శిబిరం
సర్పంచ్ వరలక్ష్మీ సాగర్
మద్దూరు అక్షిత న్యూస్:
మండలంలోని జాలపల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు వైద్య శిబిరం నేటి నుండి (గురువారం)ప్రారంభిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీ సాగర్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.ఈ సందర్బంగా అమే మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ని గ్రామాల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి సమస్య లేని రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు.18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకొనీ మెరుగైన చూపు పొందాలని సర్పంచ్ వరలక్ష్మీ సాగర్ గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాగుల సంపత్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఏ ఎన్ ఎం కరుణశ్రీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.