చలివేంద్రాలు బాటసారులకు ఎంతో దోహదపడతాయి
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్, అక్షిత న్యూస్:
కోదాడ బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యం రద్దీగా ఉండే సాయిబాబా థియేటర్ బజారు నందు ,ఈరోజు బుడిగం జయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నరేష్ ,బుడిగం రాజేష్ ,దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం ఎంతో రద్దీగా ఉండే బజారులో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు రోజురోజుకీ పెరుగుతున్న ఎండలు వల్ల వడదెబ్బ వల్ల ప్రమాదాలు జరగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో బాటసారులకు మంచినీళ్లు అందించడం, దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు.

సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న బులియన్ మార్చంట్ అసోసియేషన్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో కోదాడ బులియన్ మార్చంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుందరి వెంకటేశ్వర్లు.ఉప్పల శ్రీనివాస్, బొలిశెట్టి కృష్ణయ్య , పి,ఏ, సి,ఎస్ వైస్ చైర్మన్ బుడిగమ్ నరేష్ కుమార్ ,కౌన్సిలర్ కోట మధు, మైసా రాంబాబు ,ఓరుగంటి నవీన్, బుడిగం రాజేష్ ,మేకల నరేష్, ఆరె నవీన్ ,నూక పొంగు రామకృష్ణ, పాయల రమేష్ ,నాగార్జున రెడ్డి, సందుల భాస్కరరావు ,తదితరులు పాల్గొన్నారు