అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేస్తాం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి
న్యాయం చేస్తాం.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కొన్ని సంవత్సరాల క్రితం
డి.డి.లు కట్టిన ప్రతి ఒక్కరికి విడతలవారీగా డబల్ బెడ్రూం ఇండ్లు అందిస్తాం:ఎల్బీనగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
బుధవారం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..నందనవనం కాలనీ నందు గతంలో దాదాపు 512 ఇండ్లు నిర్మించడం జరిగింది.అయితే అట్టి ఇండ్లలో ఇతరులు అక్రమంగా వచ్చి అట్టి ఇండ్ల తాళలు విరగొట్టి కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం అట్టి ఇండ్లలో నివాసం ఉంటున్న వారిచే రెవెన్యూ అధికారులు ,పోలీస్ వారిచే సమావేశం ఏర్పాటు నిర్వహించారు.తక్షణమే ఇండ్లు ఖాళీ చేయాలని తెలిపారు.అట్టి ఇండ్లు ఖాళీ చేస్తే మరొక చోట ఇండ్లు ఇస్తామని తెలిపారు. అయితే కొందరు ఇండ్లు ఖాళీ చేసి పోవడం జరిగింది. మరికొందరు అక్కడే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పోయిన వారు వారు ఉంటున్న ఇండ్లలో సరిఅయిన సదుపాయాలు లేవని మొరా పెట్టుకోవడం జరిగింది. సుధీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడి ప్రజలు పడుతున్న కష్టాలు వివరించారు. వారు వెంటనే కలెక్టర్ తగు ఆదేశాలు జారీచేశారు. దానిలో భాగంగా నందనవనం ఇండ్లలో అక్రమంగా ఉంటున్న వారిని అక్కడే ఉండే విధంగా ఆదేశించారు. అలాగే న్యాయంగా ప్రభుత్వానికి ఎవరైతే 86000 వేల రూపాయల డి.డి. చెల్లించారో వారికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది అని తెలిపారు. డి.డి.లు కట్టిన వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు నియోజక వర్గ పరిధిలో ఉన్న వనస్థలిపురంలోని రైతు బజార్ ప్రక్కన, మన్సురాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తి, హయత్ నగర్ బొమ్మల గుడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు .ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నందు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారికి మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రజల చెప్పుడు మాటలు విని ఆందోళన చెందవద్దని, దళారులను మాటలు నమ్మవద్దని, ఎవరికి ఎలాంటి ఒక్క రూపాయి ఇవ్వొద్దని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలు కొందరు గతంలో మేము ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరాగా ఈ విషయమై ఎమ్మెల్యే సానుకులంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు నావంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking