ఘనంగా బిజెపి మైనార్టీ మోర్చా నేత ముజీబ్ జన్మదిన వేడుకలు
వృద్ధాశ్రమంలో పండ్లు, బిస్కెట్ల పంపిణీ
కరీంనగర్ అక్షిత బ్యూరో
బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఆఫ్జాల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కట్టారాంపూర్ లోని వృద్ధాశ్రమంలో పండ్లు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఆఫ్జాల్ మాట్లాడుతూ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. బిజెపి మైనారిటీ మోర్చా నేత ముజీబ్ ఇలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.