సౌర విద్యుత్ తో రైతులకు ప్రయోజనం
పి ఎం. కుసుమ్ ఆధ్వర్యంలో మొదటి ప్లాంట్
రామన్నపేటలో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ఆదివారం సౌర విద్యుత్ ప్లాంటును ట్రాన్సకో ఎస్. ఈ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా స్లింకో ఎనర్జీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మనోడి మాట్లాడుతూ సౌర విద్యుత్ తో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తెలంగాణాలో మొట్టమొదటి సోలారప్లంట్ రామన్నపేట లో ప్రారంభించమని అన్నారు. రాబోవు రెండు వారాల్లో తెలంగాణ వ్యాప్తంగా 10 నుండి 15 ప్లాంట్ లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పి సి భాగస్వామ్యం గా స్లింకో ఎనర్జీ ఇంజనీరింగ్ పూర్తి స్థాహి మద్దతుతో ప్రాజెక్టు లను అమలు చేసిందని తెలిపారు.ఈ సందర్బంగా ప్లాంట్ యజమానులు జీవనరెడ్డి, పద్మారావు లను అభినందించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డి . ఈ మల్లికార్జున్, డి. ఈ. ఎం ఆర్ టి విజయభాస్కర్, ఏ డి ఈ శ్రీకాంత్, ఏ. ఈ. కోటేశ్వర్రావు, సబ్సటేషన్ సిబ్బంది,ప్రాజెక్ట్ డెవలపర్స్, సింకో ఇంజనీర్స్ పాల్గొన్నారు.