సిరిపురంలో ఘనంగా ప్రారంభమైన “సిరి స్టోన్ మెటల్ క్రషర్”

సిరిపురంలో ఘనంగా ప్రారంభమైన “సిరి స్టోన్ మెటల్ క్రషర్”

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిరి స్టోన్ మెటల్ క్రషర్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రషర్ కంపెనీ డైరెక్టర్ సిరిగిరెడ్డి సంజీవ రెడ్డికి ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking