రెండు చుక్కలు అంతులేని రక్షణ, పిల్లల భవిష్యత్తుకు భరోసా

రెండు చుక్కలు అంతులేని రక్షణ, పిల్లల భవిష్యత్తుకు భరోసా

పంతంగి ప్రైమరీ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమం

చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి

పంతంగి గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా మరో ముందడుగు పడింది.గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది హెల్త్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు.సర్పంచ్ శ్రీలత సుందర్ మాట్లాడుతూ “5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. పోలియో రహిత భారతదేశం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని” పిలుపునిచ్చారు.ఉపసర్పంచ్ బోయ సదానందం మాట్లాడుతూ, గ్రామంలో ఒక్క పిల్లవాడు కూడా మిగిలిపోకుండా చుక్కలు వేయించేలా వార్డు సభ్యులు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.హెల్త్ సిబ్బంది ప్రత్యేక బృందాలు ఏర్పడి, వచ్చిన ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేసి, వారి ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు పెట్టారు. తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో తమ పిల్లలను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking