పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం

పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం

భావితరాల భవిష్యత్తును కాపాడుదాం 

గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని, ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యురాలు నేరటి మానస, గ్రామ పెద్దలు రాపోలు శ్రీకాంత్, గుంజేఆంజనేయులు, అంగన్వాడి టీచర్ బత్తుల వసంత, ఎం పి హెచ్ ఎ రత్నకుమారి, ఆశా వర్కర్లు జెల్లా సంధ్య జెల్లా పారిజాత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking