పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కల్లడి గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్…!

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కల్లడి గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్…!

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కల్లడి గ్రామంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గంగోల్ల సుస్మిత ప్రళయ్ తేజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత గ్రామ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కల్లడి పీహెచ్‌సీ డాక్టర్ ప్రకాష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి, ఏఎన్‌ఎం దమయంతి, ఆశా వర్కర్ బోధకళ, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, సరోజతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking