చెరువులను తలపించేలా రోడ్లు

చెరువులను తలపించేలా రోడ్లు

 పట్టించుకున్న వారే లేరాయే

 ప్రమాదం అంచుల్లో ప్రయాణం చాగల్సిందేనా

 డి వై ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్

 మునగాల అక్షిత ప్రతినిధి 

మునగాల మండలం పరిధిలోని మోద్దుల చెరువు స్టేజి నుండి మోతే మండల కేంద్రం వరకు ఉన్న లింకు ప్రధాన రహదారి రేపాల గ్రామం గత కొన్ని ఏళ్లుగా వర్షపు నీరు ఆగి ప్రధాన రహదారి వెంట బాటసారిలకు ఇబ్బంది కలుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని డి వై ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యుడు రేపాల గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త తుమ్మ సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.గత కొన్ని ఎండ్లుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు పత్రికా ప్రకటనలు చేసిన సంబంధిత అధికారులు పట్టించకపోవడం వల్ల సమస్య అధికమవుతుందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. లేనియెడల గ్రామస్తులతో కలిసి నిరసన కార్యక్రమం సంబంధిత అధికారుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking