ఘనంగా మాజీ ప్రధాని పి.వి.నరసింహ రావు జయంతి వేడుకలు

ఘనంగా మాజీ ప్రధాని పి.వి.నరసింహ రావు జయంతి వేడుకలు

కరీంనగర్ అక్షిత బ్యూరో

మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పి.వి.నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ కర్త అని, పివి నరసింహారావు జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలకు రూపు తీసుకువచ్చి,దేశాన్ని ఆర్థికంగా ముందంజలో నిలిపిన వ్యక్తి పి.వి అని వారి ఆశయ సాధన కోసం, వారు చూపిన బాటలో, వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడవాలనిఅన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking