బైరాన్ పల్లి కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన ఎం పి ఓ

బైరాన్ పల్లి కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన ఎం పి ఓ

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఎం పి ఓ ఖాజా మైనొద్దిన్ బుదవారం సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరినీ కంటి వెలుగు వైద్య శిబిరానికి తరలించడంలో వైద్యసిబ్బంది, ఆశా అంగన్వాడి కార్యకర్తలు భారీగా ప్రచారం నిర్వహించడంతో అందరు కంటి పరీక్షలు చేసుకున్నరని అయన అన్నారు.అదే విధంగా మండలంలోని ప్రతి గ్రామంలో సిబ్బంది ఇదే విధంగా ప్రజల్లో కంటి వెలుగు విశిష్టత ప్రచారం చేస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం ఖాయమన్నారు. అందు కోసం ప్రతి ఒక్కరం మన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం కంటి వెలుగు పరీక్షలు చేసుకోనే విధంగా చైతన్యం చేయడంలో బాగస్వాములావుదమని కోరారు.ఈ కార్యక్రమంలో కంటి వైద్య వైద్యాధికారి స్టూవర్ట్ సన్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking