పాత పెన్షన్ సాధనకోసం పోరాడుదాం

పాత పెన్షన్ సాధనకోసం పోరాడుదాం

 త్వరలో ఉద్యమ కార్యాచరణ

 తెలంగాణ సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి,  

నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి

తెలంగాణ సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం (టి.జి.సి.పి.ఎస్.ఈ.యూ) ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధనకోసం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుటకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్,రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి,మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భద్రత లేని సి.పి.ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని,ఈ సి.పి.ఎస్ విధానం వల్ల రిటైర్మెంట్ అనంతరం వృద్దాప్యంలో ఆర్ధిక, ఆరోగ్య భద్రత లేక ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ,పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం దశాబ్ద కాలంగా ఉద్యమం చేస్తున్నామని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం అని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టారని ప్రభుత్వం ఏర్పాటై నేటికీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా,పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సి. పి. ఎస్ విధానం వల్ల రిటైర్డ్ సి. పి. ఎస్ ఉద్యోగుల వృద్దాప్య జీవితం అగమ్యగోచరంగా మారిందని, ముప్పై కి పైగా డి.ఏ ఏరియర్స్ పెండింగ్లో ఉండడం, రిటైర్డ్ సి. పి. ఎస్ ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ కార్డుల ఇవ్వకపోవడంతో సి.పి.ఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సుమారు 30 సంవత్సరాలు ప్రభుత్వసేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం వారి వృద్దాప్య జీవితానికి భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కు పాత పెన్షన్ సాధనకోసం 2004 నుండి పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం స్పందించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణకు సిద్దమయ్యామన్నారు. రెండున్నర లక్షల సి.పి.ఎస్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు మన్నూరు నాగన్న , వీరమని, ఈశ్వర్,విజయ్ భాస్కర్ రెడ్డి, క్రాంతి సందీప్,కొరివి కృష్ణ, నర్సింగ్ రావు, బుచ్చిబాబు , సుధీర్ , మన్నన్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking