సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహమ్మద్ ప్రవక్త
బి ఎస్పీ జనగామ నియోజకవర్గ కార్యదర్శి పాకాల ఇసాక్
మద్దూరు అక్షిత న్యూస్:
ప్రపంచంలో సమ సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప అల్ల మహమ్మద్ ప్రవక్త అని బి ఎస్పీ జనగామ నియోజకవర్గ కార్యదర్శి పాకాల ఇసాక్ అన్నారు.శనివారం మండలంలోని లద్దునూర్ గ్రామంలో ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ఈద్గా వద్ద ప్రత్యెక ప్రార్దనలు చేస్తున్న ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప వ్యక్తి ఆల్లా ఆని అయన సేవలను కొనియాడారు. అల్లా దయవల్ల మన దేశ ప్రజలు ఆరోగ్యంగా పాడి పంటలతో విలసిల్లాలని ఇసాక్ కోరుకున్నారు.ఈ బి ఎస్పీ నాయకులు కొమ్ము ఎల్లయ్య,మాల్లారపు ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.