కార్మికులను విస్మరించి కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్న పాలకులు మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
కార్మికులను విస్మరించి కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్న పాలకులు
మేడే వారోత్సవాలు జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వారోత్సవాలను సిఐటియు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించాలని సిఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. రామన్నపేటలో సిఐటియు మండల కమిటి సమావేశం నకిరెకంటి రాము అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ చికాగో నగరంలో అధిక పనిగంటలకు వ్యతిరేకంగా కార్మికులు చిందించిన రక్తంతో తడిసిన ఎర్ర జండాలను అన్ని రంగాల కార్మికులు వాడవాడలా ఆవిష్కరణలు చేయాలన్నారు. నూతన లేబర్ చట్టాలతో కార్మికుల పరిస్థితి దుర్బరంగా మారుతున్నాయన్నారు. కార్మికులు సంఘాలు పెట్టుకుని హక్కులకోసం ఉద్యమించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు.మోడీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్పోరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం చేస్తూ దేశసంపదను కాజేస్తుందన్నారు. మేడే పోరాట అమరుల స్పూర్తిని కొనసాగిస్తూ ప్రభుత్వాలు అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహాంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వినర్ గొరిగె సోములు,జిల్లా కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం,హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూడిద భిక్షం,గ్రామ పంచాయతీ వర్కర్స్ మండల కార్యదర్శి నకిరేకంటి రాము,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జుంపాల మహేష్,గాదె కృష్ణ,దండిగ అంజయ్య,ఏనుగ నర్సింహ్మ,మోటె అంజయ్య,బొడ్డు సాలయ్య,మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.