వీధి కుక్కల నుండి ప్రజలను రక్షించండి ఏ ఐఎఫ్ డి వై వినతి

వీధి కుక్కల నుండి ప్రజలను రక్షించండి
ఏ ఐఎఫ్ డి వై వినతి

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి: శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో వీది కుక్కల నుండి ప్రజలను రక్షించాలని ఈరోజు ఏఐఎఫ్ డివై శెరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు కె షరీష్,ఇ.దశరథ్ నాయక్ లు మాట్లాడుతూ… శేర్లింగంపల్లి జోనల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలోని కాలనీలో, బస్తీలలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరగడం తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అట్టి కుక్కల నుండి ప్రజలు రక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో నగరంలోని అంబర్ పేట ప్రాంతంలో పసిపాపను పీక్కతిన్న సంఘటన మరువకముందే ఇటీవల మియాపూర్ ప్రాంతంలోని పి.ఏ నగర్ లో వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడిన సంఘటనతో పాటు కుక్కల దాడితో గాయపడ్డ వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వారు తెలియజేశారు.ప్రజల నివాసాల నుండి వీధి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించి వాటి నుంచి ప్రజలను రక్షించాల్సిందిగా తెలియజేశారు. ఇండ్లలో పెంపుడు కుక్కలకు ఏదైనా గుర్తింపుగా ఇంటి యజమానులు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభుత్వం జారీ చేయాలని అలాగే వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలను అధికారులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking