కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం -*బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం
-*బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
జిన్నారం, అక్షిత ప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం ఎస్ సి కాలనీకి చెందిన 60 మంది బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మరియు యువకులు కాట శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. బీ ఆర్ ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల కన్నీరు ఆగడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే యువతకు భవిష్యత్తు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కాట శ్రీనివాస్ గౌడ్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, మాజీ మండల్ ప్రెసిడెంట్ వీరారెడ్డి, ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, సర్పంచ్ నీలమ్మ, అంజాద్, రవీందర్ గౌడ్, వెంకటేష్, మహిపాల్ రెడ్డి, శంకర్, సుధాకర్, ప్రేమ్ కుమార్, రమేష్, నాగరాజు, ఆశీర్వాదం, రాజు తదితరులు పాల్గొన్నారు.