అమిత్ షా తెలంగాణ గడ్డ ఉద్యమ పోరాటల అడ్డా -మత రాజకీయాలు చెల్లవు -సామాజిక కార్యకర్త యువ న్యాయవాది సాదిక్ షేక్
అమిత్ షా తెలంగాణ గడ్డ ఉద్యమ పోరాటల అడ్డా
-మత రాజకీయాలు చెల్లవు
-సామాజిక కార్యకర్త యువ న్యాయవాది సాదిక్ షేక్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
భారతదేశం లో రిజర్వేషన్ ల వ్యవస్థ రాజ్యాంగ ప్రకారం నడుస్తుంది ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపదికన కాదు. ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా పరమైన వెనుకబాటు పై ఎన్నో కమిటీ లు అధ్యయనం చేసి ఎన్నో నివేదిక లు సమర్పించాయి.రంగనాథ్ మిశ్రా కమిషన్ జస్టిస్ సచార్ కమిటీ అమితాబ్ కుండు కమిటీ సుస్పష్టం గా ముస్లిం ల స్థితి గతులు ఎస్సీ ఎస్టీ దళితుల కన్నా ఎంతో దయనీయంగా వెనుకబడి ఉన్నాయి అని చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలు తన పార్టీ ముస్లిం వ్యతీరేఖ వైఖరి కి అద్దం పడుతున్నాయన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5 శాతం రిజర్వేషన్లు అప్పటి కాంగ్రెస్ సీఎం వై యస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనారిటీల కు రిజర్వేషన్లు కల్పించారు.అప్పుడు కూడా కాషాయ రాజకీయ పార్టీ అనుభంద సంఘాలు నానా రభస చేశారు.రాజ్యాంగం ప్రకారం 5% రిజర్వేన్ ని 4% శాతంకు కుదించారు.ఇప్పటికీ సుప్రీం కోర్టు అధీనం లోనే కేసు నడుస్తుంది.తెలంగాణ రాష్ట్రం లో పర్యటించిన అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు.ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పకుండా మళ్ళీ హిందూ ముస్లిం ఓవైసీ రిజర్వేషన్ పై మాట్లాడటం కేంద్ర వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసం ఆడుతున్న మత రాజకియాలను తీవ్రంగా ఖండించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీరి కపట రాజకీయాలకు తెలంగాణ లో స్థానం లేదని అడ్వకేట్ సాదిక్ షేక్ అన్నారు.కర్ణాటకలో కూడా ఇలానే ముస్లిం రిజర్వేన్లపై డ్రామా చేస్తే కోర్టు స్టే ను మరిచారా అని గుర్తు చేశారు.రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం అని మాట్లాడే వారికి రాజ్యాంగ విలువలు లౌకికవాదం ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా దున్నోపోతు పై వర్షం పడ్డట్టే అని చమత్కరించారు. ప్రజాస్వామ్య శక్తులు రాజ్యాంగ విలువలకు పోరాడే వారందరూ ఏకమై మత రాజకీయాలకు వ్యతిరేకంగ పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది అని సామాజీక కార్యకర్త యువ న్యాయవాది సాదిక్ షేక్ పిలుపునిచ్చారు.