మండల కేంద్రంలోని పెదవాగు ఇసుకకు స్థానిక గిరిజనులతో ఇసుక సొసైటీ ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం
మండల కేంద్రంలోని పెదవాగు ఇసుకకు స్థానిక గిరిజనులతో ఇసుక సొసైటీ ఏర్పాటు చేయాలి,
పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా,
సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం
పినపాక అక్షిత ప్రతినిధి:
కరకగూడెం మండల కేంద్రంలోని పెద్దవాగు ఇసుకకు స్థానిక గిరిజనులతో ఇసుక సొసైటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి చెర్ప సత్యం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి సమీపంలో గల పెదవాగులో ఇసుక యదేచ్చగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొనసాగుతుందని గోదావరిలో ఇసుక ర్యాంపు లాగా అనునిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతొ ఇసుక తోలుతున్నారని ఈ ఇసుక వలన ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని, నయా పైసా ఆదాయం పొందకుండా సహజ సంపదను ఏదేచ్ఛగా అక్రమ రవాణా దారులు కొల్లగొట్టి బయట ఇసుక వ్యాపారం నడిపిస్తున్నారని వారు దుయ్యబట్టారు. తక్షణమే ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా స్థానిక గిరిజనులతో ఇసుక సొసైటీ గాని, పంచాయతీ ఇసుక పాలసీని గాని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చర్యలు చేపట్టని ఎడల తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, అక్రమ రవాణాను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు పాల్గొన్నారు.