కోర్టు భవన నిర్మాణానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వ నుండి అన్ని అనుమతులు వచ్చాయని, త్వరలో శంకుస్థాపన త్వరలో కోదాడ కోర్టు బిల్లింగ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .
కోదాడ కోర్టు అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
కోర్టు భవన నిర్మాణానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వ నుండి అన్ని అనుమతులు వచ్చాయని, త్వరలో శంకుస్థాపన
త్వరలో కోదాడ కోర్టు బిల్లింగ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .
కోదాడ టౌన్ అక్షిత న్యూస్:
కోదాడ కోర్టు అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ .కోదాడ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు నూతన భవనాన్ని త్వరలో నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.25కోట్ల రూపాయల తో నాలుగు సముదాయాల కోర్టు బిల్డింగ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని తెలిపారు.500 పై కేసులు కలిగివున్నాం మన కోదాడ కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది అని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 59 కోర్ట్ లకు ప్రతిపాదనలో కోదాడ ఉండటం శుభపరిణామమని ఆయన అన్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ పట్టాననికి కోర్టు బిల్డింగ్ ని కావాలని కోరడంతో నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఆయన తెలిపారు.

త్వరలోనే కోర్డు బిల్డింగ్ నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.కోదాడ లో జిల్లా అదనపు కోర్టు తీసుకురావాడిని నావంతుగా ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవబత్తిని నాగార్జున,బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి సాధు శరత్ బాబు, జాయింట్ సెక్రటరీ సీతారామరాజు, కార్యవర్గ సభ్యులు శ్రీధర్, చలం,సీనియర్ న్యాయవాదులు వేజెళ్ల రంగారావు, గట్ల నర్సింహ రావు, ఈదుల కృష్ణయ్య, బండారు రమేష్, దావీదు, బండి వీరభద్ర రావు, మంద వెంకటేశ్వర్లు, కంచర్ల శరత్ కుమార్, నాగుల్ పా షా తదితరులు పాల్గొన్నారు.