నూతన ఆవిష్కరణలతోనే సాంకేతిక విప్లవం

సనా ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

విద్యార్థులు కొత్త సాంకేతిక ప్రాజెక్టులతో గొప్ప పేరు తెచ్చుకోవాలి

సన ఇంజనీరింగ్ చైర్మన్ మహమ్మద్ నజీరుద్దీన్

కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :

నూతన ఆవిష్కరణలతోనే సాంకేతిక విప్లవం పరిడవిల్లనుంది. సనా ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం బీటెక్ విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. సనా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ మహమ్మద్ నజీరుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త సాంకేతిక ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సాధించి విద్యార్థులు గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్నారు. స్థిరమైన భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలలో విద్యార్థులు సమగ్ర విధానం అవలంబించుకోవాలన్నారు.

భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవానికి ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సనా ప్రిన్సిపల్ పెరుమళ్ళ గాంధీ వైస్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్ రఫీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking