బ్రహ్మి ఇంట్లో నిశ్చితార్ద సందడి

బ్రహ్మి ఇంట్లో నిశ్చితార్ద సందడి
సిద్ధార్ద్ తో ఐశ్వర్యకు పరిణయం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మనందం ఇంట్లో నిశ్చితార్ద సందడి అలరించింది. ఎన్నో తెలుగు సినిమాలలో తన అద్భుతమైన కామెడీ డైలాగులతో కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని వందల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో సక్సెస్ గా బ్రహ్మానందం కొనసాగించారని చెప్పాలి.
బ్రహ్మానందం వారసుడిగా ఇండస్ట్రీలోకి గౌతమ్ అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈయన కూడా పలు సినిమాలలో నటించారు. అయితే గౌతం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. అయితే బ్రహ్మానందంకు కేవలం గౌతం ఒక్కడే కొడుకుగా భావిస్తున్నారు. కానీ బ్రహ్మానందంకు మరో కొడుకు కూడా ఉన్నారు. ఆయన పేరు సిద్ధార్థ ఈయన విదేశాలలో స్థిరపడ్డారు.అయితే చిన్న కుమారుడికి బ్రహ్మానందం ఆదివారం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు.

ఐశ్వర్యతో సిద్దార్థ్‌
 నిశ్చితార్థ వేడుక…

బ్రహ్మానందం తన చిన్న కుమారుడికి ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది. బ్రహ్మానందంకు కాబోయే కోడలు కూడా డాక్టర్ కావడం విశేషం. ఇలా వీరిద్దరి నిశ్చితార్థం ఆదివారం ఎంతోమంది సినీ సెలబ్రిటీల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహ తేదీని కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఇద్దరిదీ పెద్దలు నిశ్చయించిన వివాహం అని తెలుస్తుంది.ఇక బ్రహ్మానందం సినిమాల విషయానికొస్తే తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అన్ని సినిమాలలో నవ్వించిన బ్రహ్మానందం ఈ సినిమాలో మాత్రం అందరి చేత కంటతడి పెట్టించారనే చెప్పాలి. అతని మాటలు వింటేనే కడుపుబ్బా నవ్విస్తాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking