మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

ప్రజా సేవలో విట్టల్‌రెడ్డి సేవలు ఆదర్శనీయం…

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్త గౌడ్

లోకేశ్వరం, ఆగస్టు 6 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్‌రెడ్డి జన్మదిన వేడుకలను లోకేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్త గౌడ్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేసిన నాయకుడని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడిగా విట్టల్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ఆయన ప్రజా సేవను మరింత విస్తరించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు,ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు, సర్పంచ్ ధర్వాడి కపిల్, లలిత, భోజన్న,సుధీర్‌రెడ్డి,రాణి, రాజు,సంగేమ్ నర్సన్న,బచ్చన్నతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking