సుపరిపాలనతో పల్లెల ప్రగతి

సుపరిపాలనతో పల్లెల ప్రగతి
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సుపరిపాలనతోనే పల్లెల ప్రగతి సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మన్నారు వేడుకలలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డితో కలిసి పారిశ్యుద్ద కార్మికులను, అంగన్ వాడి కార్యకర్తలను, ఆశా కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, యంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మాజీ మార్కట్ కమిటి డైరెక్టర్ పులి జగదీష్, ధర్మపాల్ రెడ్డి, సర్పంచ్ గజ్జల జయమ్మ కోటిరెడ్డి, గ్రామపార్టీ అద్యక్షులు వంగాల వెంకట రెడ్డి, ఉప సర్పంచ్ బీసం వెంకటేశ్వర్లు, ఆదిమళ్ళ నగేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking