ఆటవిడుపులా డాక్టర్స్ క్రికెట్
జేవీఆర్ జేలో పెట్టుబడి
భవిష్యత్ తరాలకు మదుపరి
బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎంఎస్ కే ప్రసాద్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
నిత్యం బిజీగా ఉండే డాక్టర్లకు ఆటవిడుపులా స్టేట్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఉపయుక్తంగా… ఉల్లాసంగా ఉంటుందని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎంఎస్ కే ప్రసాద్ అన్నారు. సోమవారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఎంఎస్ కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, జేవిఆర్ జే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ జెర్సీ లాంచింగ్ ప్రోగ్రాంకు గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నిత్యం బిజీగా ఉండే డాక్టర్లకు ఈ క్రికెట్ టోర్నమెంట్ కాసింత మానసిక ఒత్తిడిని జయిస్తుందన్నారు.

క్రీడా రంగంలో క్రికెట్ కు అత్యంత ప్రాచుర్యం ఉండడంతో యువత, అందరికి క్రికెట్ పట్ల మక్కువ అధికంగా ఉంటుందన్నారు.ఈ డాక్టర్స్ క్రికెట్ రాష్ట్ర స్థాయి నుంచి ఇంతిoతై వటుడింతై అన్న చందంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెడితే మరింత భద్రంగా ఉంటుందో అక్కడ పెట్టుబడి పెట్టాలన్నారు. జేవీఆర్ జేలో పెట్టుబడి…భవిష్యత్ తరాలకు మదుపరి లాంటిదన్నారు. జేవీఆర్ జే హైదరాబాద్ నగరంలోని ప్రైమ్ లొకేషన్లలో మంచి ప్రాజెక్ట్స్ ను రూపుదిద్దిందని, ఆయా ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి భవిష్యత్ కు లాభసాటిగా ఉంటుందన్నారు. ముఖ్య అతిధులుగా హాజరైన
ఇన్ కంటాక్స్ కమీషనర్ డా. ఎల్ రాంజీ రావు, హైదరాబాద్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్, నంది అవార్డు గ్రహీత, సినీ నిర్మాత రాంకీ గర్గపర్తి, జేవిఆర్ జే గ్రూప్ చైర్మన్ భాస్కర్ రామ్ గుప్తలు మాట్లాడుతూ వైద్యుడు దేవుడితో సమానమని… ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు. దేవుడు మనలను సృష్టిస్తే… ఆపత్కాల… అత్యయిక పరిస్థితిలో డాక్టర్లు మరో జన్మను ప్రసాదిస్తారన్నారు. ప్రధానంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో యావత్తు ప్రపంచ వైద్య రంగానికి పెను సవాలుగా పరిణమించిన సుమారు 57 రోజుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డాక్టర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు. డాక్టర్ల త్యాగ పూరిత సేవల ఫలితంగానే యావత్ సమాజం ఊపిరి పీల్చుకుందన్నారు. డాక్టర్ల మానసిక ఒత్తిడిని జయించేందుకు క్రీడలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. జేవిఆర్ జే నారాయణఖేడ్ లో పామ్ ల్యాండ్స్, పటాన్ చెరువు, ఘట్కేసర్ ల్లో అపార్ట్ మెంట్ ప్రాజెక్టులు సకల అనుమతులతో నిర్మాణ పనుల్లో శర వేగంగా దూసుకెళ్తుందన్నారు. మరో అడుగు ముందుకేసి అస్సాంలో జాట్నా టీ ఎస్టేట్ ను కస్టమర్లు, ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తేవడం శుభ పరిణామమన్నారు. ఆయా ప్రాజెక్ట్స్ లో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండి సకల సదుపాయాలను కల్పిస్తుందని వారు చెప్పారు.అనంతరం స్టేట్ డాక్టర్స్ టోర్నమెంట్ లో భాగంగా జెర్సీలను అందజేశారు. సినీ నటి విద్య వ్యాఖ్యతగా వ్యవహరించగా జేవిఆర్ జే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి సుధా భాస్కర్ రామ్ గుప్త, మాలతి, వెంకట్, మురళి, జయకృష్ణ, మోహన్, కళ్యాణ్, రాజు, సుదర్శన్, శివాలి, సాయి తదితరులు పాల్గొన్నారు. జెర్సీల పంపిణి ఆధ్యoతం కన్నుల పండువగా సాగింది.