కౌంటీ 2లో పెట్టుబడి… బిడ్డల భవిష్యత్ కు పునాది

కౌంటీ 2లో పెట్టుబడి
బిడ్డల భవిష్యత్ కు పునాది

ప్యూచర్ డెస్టినేషన్ కౌంటీ 2

తెలంగాణ గోల్డ్ మ్యాన్ దుర్గం శ్రవణ్

రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు

కొంపెల్లి, అక్షిత ప్రతినిధి :

కొంపెల్లి కౌంటీ 2లో పెట్టుబడి మన బిడ్డల భవిష్యత్ కు
పునాది వంటిదని తెలంగాణ గోల్డ్ మ్యాన్ దుర్గం శ్రవణ్ అన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపెల్లి పరిధిలోని రావెల్ కోల్ లో రాజా ఇన్ ఫ్రా కౌంటీ 2 ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూముల మీద పెట్టుబడి భవిష్యత్ తరాలకు మదుపు లాంటిదన్నారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో ప్లాట్లు, భూముల మీద పెట్టుబడి పెట్టుకున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు మాట్లాడుతూ మన బిడ్డల ఆర్థిక పరిపుష్టికి రాజా ఇన్ ఫ్రాలో పెట్టుబడి పెట్టాలన్నారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ప్రతి వ్యక్తి ప్లాట్లు, విల్లాల రూపంలో మదుపు చేసుకోవాలని ఆయన సూచించారు.

కౌంటీ 2ను తమ 22 వ వెంచర్ గా ఇప్పటికే 21 వెంచర్లను పూర్తి చేశామన్నారు. అత్యంత ప్రైమ్ ప్లేస్ లో సామాన్యుడికి అందుబాటు ధరల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. తమ సంస్థ వేలాది మంది కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కస్టమర్లు పెట్టే పెట్టుబడికి రెట్టింపు… అంతకంటే మిన్నగా అదనపు ఆదాయం రానుందన్నారు.

కౌంటీ2లో సకల సదుపాయాలను కల్పిస్తుందన్నారు. పేరెన్నిక గల రియల్ వెంచర్ల సరసన కౌంటీ 2 ప్యూచర్ డెస్టినేషన్ మనగలగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమామ్, వెంకట్, డేవిడ్ సుబ్రహ్మణ్యం, అక్షిత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ యం. భరత్ కుమార్, ధనుంజయరెడ్డి సుమారు 200 మంది కస్టమర్ లు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking