పల్లె రహదారులకు మోక్షం
రూ.5.80కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
*అన్ని గ్రామాలకు రవాణ సౌకర్యాలు
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
పల్లెల రహదారులకు మోక్షం లభించింది. రహదారులను మెరుగుపర్చేందుకు సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని తగిన నిధులను కేటాయిస్తుండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ (ఎస్టి-ఎస్డిఎఫ్) ద్వారా 1.90 కోట్ల రూపాయల వ్యయంతో సల్కనూర్ నుండి సీత్యతండ వయా మంగాపురం వరకు 2.5 కిలో మీటర్ల మేర నూతన బి.టి రోడ్డు నిర్మాణ పనులకు, 3.90 కోట్ల రూపాయల వ్యయంతో తక్కెళ్ళపహాడ్ నుండి జేత్యా తండా వయా తక్కెళ్ళపహాడ్ తండా వరకు 4.5కిలో మీటర్ల మేర నూతన బిటి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు రోడ్డు రవాణ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నాదన్నారు.

అనంతరం మంగాపురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు, వారిని ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు, కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జడ్పి కో ఆప్షన్ సభ్యులు మోహ్సిన్ అలీ, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, యంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, పోకల శ్రీవిద్య రాజు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చిట్టిబాబు నాయక్, వైస్ యంపిపి అమరావతి సైదులు, మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు యాదవ్, పాక్స్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచ్లు పాశం నరసింహరెడ్డి, సాయిని సైదులు, చౌగాని బిక్షం గౌడ్, అంకెపాక రాజు, భుక్య సైదమ్మ, మంజ్య, చిర్ర మల్లయ్య యాదవ్, ఏలకాని సుజాత రమణ, చెరుకుపల్లి కృష్ణవేణి సుమన్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, మారుతీ వెంకట్రెడ్డి, యంపిటిసి పాశం హైమవతి, గడ్డం రాములమ్మ, వెంకన్న, కత్తి కనకారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ యంపిటిసిలు, గ్రామ పార్టీ అద్యక్షులు పాల్గొన్నారు.