పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే అమలు చేయాలి
-మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం రాబోయే పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ను తక్షణమే అమలు చేయాలని ఈ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లును అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమన్నారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏన్నుకున్నారు.
మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి ఖమ్మం జిల్లా యువసేన అధ్యక్షులుగా జెరిపోతుల నరేష్ మాదిగని నియమించారు.మాదిగ హక్కుల దండోరా వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా తడికమల్ల కాటయ్య మాదిగ ను ఏన్కూర్ మండల అధ్యక్షుడు కార్యదర్శులుగా ఏకిరాల సామేలు మాదిగ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా గుడ్ల నారాయణ మాదిగా ను ఏన్కూర్ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జెర్రిపోతుల నరేష్ మాదిగ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉండి నాకు పదవి కట్టబెట్టిన మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ కి జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగకి రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగకి కృతజ్ఞతలు తెలిపారు.