తవ్వకాలలో బయటపడిన పావన గొట్టం
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో తవ్వకాలలో కాకతీయుల కాలంలో నీ శివలింగం యొక్క పావన గొట్టం బయటపడింది.ఈరోజు గరిడేపల్లి మండల కేంద్రంలోని దేనేపల్లి అంజన్ రావు ఇంటిలో గోడలు నిర్మించడానికి పునాది తవ్వుతుండగా కాకతీయుల కాలం నాటి శివలింగం పావన గొట్టం బయటపడింది. దీనిని తిలకించడానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో క్యూలైన్ కట్టినారు.