గరిడేపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
గరిడేపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986 నుండి 1991 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మొదట జ్యోతి ప్రజ్వలన, తర్వాత పూర్వ విద్యార్థులందరూ మంచి చెడు కార్యక్రమాల గురించి పరిచయ వేదిక, గురువులకు సన్మాన కార్యక్రమం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1986 నుండి 1991 వరకు చదువుకున్న బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.