అర్ధరాత్రి ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద పరిస్థితి పరిశీలన
ప్రజలు ఆందోళన చెందవద్దు
నీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టింది
ధర్మపురి, అక్షిత ప్రతినిధి :
భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం కేంద్రంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిస్థితి ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

గురువారం రాత్రి ఎనిమిది గంటలకు జగిత్యాల జిల్లా కలెక్టర్, ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ధర్మపురికి చేరుకొని జిల్లా ఎస్పీ భాస్కర్, డీఎస్పీ సత్యనారాయణతో కలిసి ధర్మపురిలో గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. లక్ష్మి నరసింహ స్వామి దయతో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టిందాన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టు ల్లో నీటి ఉదృతి పెరగడంతో.. దిగువకు భారీగా నీటి ప్రవాహం వచ్చిందని తెలిపారు.