కమీషనర్ దృష్టికి ..వార్డు సమస్యలు

కమీషనర్ దృష్టికి ..వార్డు సమస్యలు

కమీషనర్ కు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి వినతి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ మున్సిపల్ కమీషనర్ దృష్టికి మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 20వ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
వినతిపత్రం అందజేశారు. వార్డులో నెలకొన్న సమస్యల తీవ్రతను చాటే చిత్రపటాలను కూడా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతంగా పలు సమస్యలు పేరుకుపోయాయని వెంటనే పరిష్కరించి వార్దు ప్రగతికి దోహదపడాలని ఆయన కోరారు. ఇటీవలే నూతనంగా పదవీ భాద్యతలు స్వీకరించిన కమీషనర్ ఆయా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, క్రికెటర్ జానీ, మంత్రాల రుణాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు శరత్, వినయ్, పర్వేజ్ ఖాన్, పసుపులేటి శేఖర్, ఇమ్రాన్, కాసర్ల రామారావు, ఓరుగంటి శివకుమార్, ఐ మొబైల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking