నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా కలిమెల నాగయ్య

నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్

కార్యదర్శిగా కలిమెల నాగయ్య

నాగయ్య ఎన్నిక పట్ల జర్నలిస్టులు హర్షం…

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్  కార్యదర్శిగా కలిమెల నాగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.టియుడబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా సర్వసభ్య (జిల్లా జనరల్ బాడీ) సమావేశం ఆదివారం పిఆర్టియు భవనంలో నల్గొండలో జరిగింది. ఈ సమావేశం టియుడబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరగగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాదీనం, యూసుఫ్ బాబు, టీయూడబ్ల్యూజే నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన మధుసూదన్ లు హాజరై, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, జర్నలిస్టుల డిమాండ్ల సాధన కోసం తీసుకోవలసిన కార్యక్రమాలపై ప్రసంగించారు. అనంతరం నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని, అందరి ఆమోదం మేరకు ఏకగ్రీవంగా “జిల్లా కమిటీ”లను ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి ఆర్సి ఇంచార్జ్, కలిమెల నాగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా చెందిన పలువురు జర్నలిస్టులు నాగయ్యకు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. నాగయ్య ఎంపిక పట్ల మిర్యాలగూడ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking