మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు

చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు

* తెలంగాణ రాష్ట్ర సాధనలో ఫొటోగ్రాఫర్ల పాత్ర కీలకం

* ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం

నల్లమోతు సిద్దార్థ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

కరిగే కాలగర్భంలో చెదరని మధుర స్మృతులకు ఫొటోలు ప్రతిబింబాలని బీఆర్ఎస్ యువనేత, ఎన్ బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ
తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. దీంతో పాటుగా 184వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి నల్లమోతు సిద్దార్థ పాల్గొని మాట్లాడారు. ఫొటోగ్రాఫర్ల సేవలను ఆయన కొనియాడారు. కాలగర్భంలో కలిసిన అనేక జ్ఞాపకాలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఫొటోలు నిలుస్తాయని అన్నారు. ప్రతీ ఫొటో వెనుక ఓ సుమధుర జ్ఞాపకం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిర్వహించిన నిరాహార దీక్ష, మిలీనియం మార్చ్, శ్రీకాంతా చారి బలిదానం వంటి ఫొటో లు చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఫొటోల చిత్ర ప్రదర్శన నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఫొటోగ్రాఫర్ల పాత్ర కీలకమన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళించిన నేపథ్యంలో ఫొటోగ్రఫీ రంగం కుదేలైందని నల్లమోతు సిద్దార్థ తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫొటోగ్రాఫర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. అనంతరం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమెంటోలు అందజేసి అభినందించారు. అనంతరం మిర్యాలగూడ డివిజన్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నల్లమోతు సిద్దార్థ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

#ప్రమాణ స్వీకారం చేసిన
నూతన కార్యవర్గం….

నూతన అధ్యక్షుడిగా సిరిమల్లె వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పందిరి లక్ష్మణ్, కోశాధికారిగా బంటు నాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వసంత చారి, ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, రాజశేఖర్, అధికార ప్రతినిధిగా సైదులు, కార్యదర్శులుగా కోట సాయి, ఇమ్మానుయేలు, సహాయ కార్యదర్శులుగా గాదెపాక సురేశ్, సండ్ర శంకర్, కమిటీ సభ్యులుగా నల్లగొండ శంకర్, కే ప్రభు కుమార్, దాసరాజు శ్రీనివాస్, తూముల రవి, మిడతపల్లి మధు, మేకల సతీష్, కమిటీ తరపున ప్రమాణ స్వీకారం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking