మళ్లీ ఆ ఇద్దరే
టీయూడబ్ల్యూజే – ఐజేయూ జిల్లా అధ్యక్షులుగా కృష్ణారెడ్డి
టీయూడబ్ల్యూజే – ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుసూధన్
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నల్గొండ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
టీయూడబ్ల్యూజే – ఐజేయూ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మళ్లీ ఆ ఇద్దరికే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులు వరించాయి. టీయూడబ్ల్యూజే – ఐజేయూ నల్గొండ జిల్లా ద్వితీయ సభ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పిఆర్ టియూ భవన్ లో జరిగాయి. ముఖ్య అతిధిగా ఐజెయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ పర్యవేక్షణలో జిల్లా, నియోజకవర్గ, ప్రెస్ క్లబ్ ల ఎన్నికలు జరిగాయి. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా గౌరవాధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మారబోయిన మధుసూదన్, కోశాధికారిగా అశ్వక్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షులుగా రంగా శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావ

డం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పులిమామిడి
అదేవిధంగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కలిమెల నాగయ్య, కోశాధికారిగా కట్టా సుధాకర్, మిర్యాలగూడ నియోజక వర్గ అధ్యక్షులుగా గుడుగుంట్ల సుందర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కే మౌలాలిలు ఎన్నికయ్యారు.
*ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్*
నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ జిల్లా అధ్యక్షునిగా దోటి శ్రీనివాస్. (స్టూడియో ఎన్ స్టాఫ్ రిపోర్టర్), ప్రధాన కార్యదర్శిగా ఎస్ రాము(CVR), కోశాధికారిగా ఎన్ హరిబాబు(V6) లు ఎన్నికయ్యారు. ఆయా కమిటీలను జాతీయ నాయకులు సత్యనారాయణ ఆమోదంతో రాష్ట్ర నాయకులు యూసుఫ్ బాబు ప్రకటించారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాధీనం జిల్లాలోని నలుమూలల నుండి తరలి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, నూతన కార్యవర్గానికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.