గుత్తా, కలెక్టర్ ప్రశంసలందుకున్న పద్మనాభం

గుత్తా, కలెక్టర్ ప్రశంసలందుకున్న పద్మనాభం
జిల్లా ఉత్తమ అవార్డును అందుకున్న పద్మనాభం

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ వి.పద్మనాభం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ల ప్రశంసలందుకుండ్రు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకoను జిల్లాల్లో పటిస్టవంతంగా అమలు చేయడంలో ఉన్నతాధికారులకు తోడుగా సెక్షన్ అధికారిగా విశిష్ఠ సేవలందింస్తుండ్రు. సామాన్యులకు ఆయా పథకo ముఖ్య ఉద్దేశ్యాన్ని అవగాహన కల్పించడం తీసుకున్న యూనిట్ లక్ష్యాన్ని సాధించి ఆయా లబ్దిదారులు ఉజ్వల భవిష్యత్ పొందుకునేలా విశిష్ఠ కృషి చేస్తుండ్రు. దళిత బంధుకు తోడు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆయా పథకాల కింద పొందే రుణాలతో ఆయా యూనిట్లను స్థాపించేందుకు పద్మనాభం కృషి అభినందనీయం. పద్మనాభం సేవలను గుర్తించి పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రశంసాపత్రాన్ని ఆర్ వి కర్ణన్ ల చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్న పద్మనాభంను పలువురు అభినందించారు. మరిన్ని సేవలందించి రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ అవార్డులను అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking