దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణం

దేశ భవిష్యత్ తరగతి
గదిలో నిర్మాణం

ఎస్ ఆర్ డి జి స్కూల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

డాక్టర్ అశోక్ కుమార్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ డి జి పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత విద్యార్థులకు ఎస్ ఆర్ పాఠశాలల చీఫ్ జోనల్ ఇంఛార్జి మనోజ్ కుమార్, జోనల్ మేనేజర్ రమణ, జోనల్ ఇంచార్జ్ ఎస్ ఎల్ రణధీర్ లు విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవం ఆవశ్యకతను తెలియజేస్తూ స్వతంత్రం మనకు సిద్ధించినటువంటి క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పుట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం కుల, మతాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ అనే అభివర్ణించారు. అదేవిధంగా 1947 సంవత్సరమునకు ముందు సుమారుగా 200 సంవత్సరాలు భారతదేశంలో బ్రిటిష్ పాలనలో భారతీయులు బానిసలుగా జీవించి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ బానిసత్వాన్ని సహించని మన జాతీయ నాయకులు కష్టపడి జీవితాలను ధారపోసి స్వతంత్రం కోసం పోరాటం చేశారు. వారి కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం సిద్ధించిందన్నారు. కష్టపడకుండా ఏ విజయాన్ని అందుకోలేమని, అదేవిధంగా విద్యార్థులు తమ ఆశయాలను చేరుకొనుటకు కష్టపడి చదివి, తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించేటువంటి అంశాలను శ్రద్ధగా విని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భవిష్యత్తులో దేశం గర్వించే భారత పౌరులుగా నిలవాలని అన్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు చేసినటువంటి పిరమిడ్స్ ఆసక్తికరంగా నిలిచాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో విజేతలు అయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అజ్గార్, రమేష్, అశోక్, లతీఫ్, మహమ్మద్ మునీర్, దుర్గాప్రసాద్, సరస్వతి, విజయలక్ష్మి, శ్రావణి , వాణి, వసంత, నేహ, నాగలక్ష్మి, సుధా, సంజన, రమ్య, అనిత, మామిడి శిరీష, చల్ల శిరీష, శోభారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking