సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బీసీల సింహగర్జన

సామాజిక న్యాయం… సబ్బండ కులాలకు రాజ్యాధికారమే ద్యేయంగా సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో బీసీల సింహగర్జన
*బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగంగౌడ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

అసెంబ్లీ ఎన్నికలలో 60 అసెంబ్లీ సీట్లు…. బీసీలకే సీఎం సీటు హామీతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, పార్టీలు తమ రాజకీయ పాలసి ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పట్టణంలో ని బీసీ భవన్ లో మాట్లాడుతూ టికెట్ల కేటాయింపులో బీసీలకు జనాభా దమాషా ప్రకారం సగం సీట్లు కేటాయించాలి. లేదంటే ఆయా పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామన్నారు. బీసీలను విస్మరించే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ పతనం తప్పదన్నారు. పథకాలు బీసీలకు పదవులు అగ్రకులాలకా? ఇదెక్కడి సామాజిక న్యాయమన్నారు. సిట్టింగులకు సీట్లు ఇస్తే బిఆర్ఎస్ ల్ పుట్టి మునగడం ఖాయం. సర్వే రిపోర్ట్ లు గెలుపు గుర్రాల పేర్లతో రెండు మూడు శాతం లేనోళ్ళకు టికెట్లు ఇస్తే అగ్రకుల రాజకీయ పార్టీలకు 2023 ఎన్నికలే చివరి ఎన్నికలు రాష్ట్రాన్ని యూనిట్ గా గాకుండా పది పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బీసీలకు సగం సీట్లు కేటాయించాలని ఓడిపోయే నియోజకవర్గాలలో బీసీలకు టికెట్లు ఇస్తే సహించమన్నారు. సెప్టెంబర్ 10 న హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు బీసీల సింహగర్జన సభ జరుగుతుంది. బీసీలది ఇప్పుడు సంక్షేమ పోరాటం కాదు… ఇక రాజకీయ పోరాటమే ఇంటికో మనిషి ఊరికోక బండి గట్టుకొని బీసీలు లక్షలాదిగా తరలిరావాలని కుల సంఘాలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బంటు వెంకటేశ్వర్లు, జానపాటి రవి, రాంబాబు యాదవ్, నక్క శేఖర్, సతీశ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking