సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

సీఎం సహాయనిధి
నిరుపేదలకు వరం

* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్

బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో వీర్లపాలెం గ్రామానికి చెందిన రమావత్ వెంకటేశ్వర్లు, దామరచర్ల గ్రామానికి చెందిన షేక్ నస్రీన్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన పద్మ గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే భాస్కర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు… సీఎంఆర్ఎఫ్ నుంచి వెంకటేశ్వర్లు చికిత్స నిమిత్తం రూ.2,50,000, షేక్ నస్రీన్ చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు, పద్మకు చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు ఎల్వోసీ చెక్కులను మంజూరు చేయించారు. గురువారం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బాధిత కుటుంబ సభ్యులకు నల్లమోతు సిద్దార్ధ అందజేశారు.

cmrf

ఈ సందర్భంగా యువనేత నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking