పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత

బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత

తిరుమలగిరి, అక్షిత న్యూస్ :

బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకుని తండా గ్రామానికి చెందిన ఇద్దరు పేద విద్యార్థులు మేరావత్ బాలచందర్ సపావత్ హరిచందర్ ఐఐటి ఖరగ్ పూర్ లో సీటు సాధించిన విద్యార్థులకు 10,000/- చొప్పున, పక్షవాతంతో మంచాన ఉన్న బుజ్జి నాయక్ కు 5000/- మరియు భార్యాభర్తలు వికలాంగురాలు సపావత్ మున్యా – లక్ష్మికి 5000/-, సపావత్ నరేష్ కు 5000/- చొప్పున బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు.

busireddy


ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ ముని నాయక్ నెల్లికల్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, సుంకిశాల సర్పంచ్ కేలావత్ జ్యోతి రామకృష్ణ నాయక్,మేరావత్ బిచ్చాలు నాయక్, శౌరి నాయక్ రామారావు, కొండ నాయక్, దేవూజ నాయక్, ముని నాయక్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking