అరవై రోజులుగా
అంధకారంలో జర్నలిస్ట్ కాలనీ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి బైపాస్ రోడ్డు అతి సమీపంలో 6 వ వార్డ్ పరిధిలో గల జర్నలిస్ట్ కాలనీలో గత రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో రాత్రిళ్ళు కాలనీ అంధకారంగా మారింది. కాలనీలోని రెండు వీధుల్లోనూ ఉన్న వీధి స్తంబాలు వెలగక రెండు నెలలు అవుతున్నా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వీధి దీపాలు వెలగక పోవడంతో రాత్రివేళల్లో పాములు, తేళ్లలాంటి విషపురుగులు వస్తున్నాయని, స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు కాలనీ పక్కన ఉన్న ప్రధాన రహదారిపై వెళుతూ ఉంటాయి. రాత్రి వేళ్లలో కాలనీ చీకటిమయంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని వాహన దారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధిదీపాలు వేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని, రెండు రోజులలో జర్నలిస్ట్ కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తానని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ తెలిపారు.