ఘనంగా సర్వాయి
పాపన్న జయంతి
*పలువురి నివాళులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో త్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతిని గౌడ సంఘం, బిసి సంఘాల, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పలువురు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయా పార్టీల నాయకులు వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాలకు వారి హక్కుల కొరకై నిరంతరం పోరాడి గోల్కొండ ఏలిన మహనీయుడని కొనియాడారు.

కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎ.నాగార్జునచారి, జె.రాములు గౌడ్, మహేష్ గౌడ్, రజక సంఘం నాయకులు నల్లగంతుల నాగభూషణం, దుర్గయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్ళపల్లి రవి, బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.రాజు, ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, కాశీ, కాంగ్రెస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, టీ.అర్జున్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలగాని వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు దేశిరెడ్డి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, మండల కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్ గౌడ్, తలకొప్పుల సైదులు మండల మైనార్టీ అధ్యక్షులు గౌస్, కంచుగంట్ల లింగయ్య యాదవ్, చౌగాని వెంకన్న గౌడ్, గౌడ సంఘం నాయకులు శ్రీరాములు, డాక్టర్ గంగవరప్రసాద్, రాయికింది చిన్నకోటయ్య, ఏడుకొండలు, సాదబొడ్డు ఎంకన్న, మోహను, వినయ్ పాల్గొన్నారు.