దిక్కులు పిక్కట్టిల్లేలా దేశం, ప్రపంచమంతా మన వైపు చూసేలా విశ్వ రూప మహాసభ

దిక్కులు పిక్కట్టిల్లేలా
దేశం, ప్రపంచమంతా
మన వైపు చూసేలా
విశ్వ రూప మహాసభ

జాతి చైతన్యానికి
జర్నలిస్టుల చొరవ

అంతిమ లక్ష్యం “వర్గీకరణ”

వర్గీకరణతోనే మన
బతుకులు బాగు

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వర్గీక”రణo” అంతిమ లక్ష్యం… ఎస్సీ వర్గీకరణ. వర్గీకరణతోనే మన బతుకులు బాగు… సుదీర్ఘ కాల పోరు ఇక అంతిమ దశకు చేరింది…దిక్కులు పిక్కట్టిల్లేలా…దేశం, ప్రపంచమంతా…మన వైపు చూసేలా…విశ్వ రూప మహాసభ హైదరాబాద్ లో జరుగుతుందని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ జివిఆర్ గార్డెన్స్ లో చాటింపు అశోక్ అధ్యక్షతన జరిగిన మాదిగ జర్నలిస్ట్ ఫోరం 7 వ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తేనే మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా న్యాయం జరుగుతుందన్నారు.

MJF

గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా వర్గీకరణ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. మాదిగ దండోరా ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ సాధించు కుంటామని, అందుకు మేధావి వర్గమైన జర్నలిస్టులు అంతా ఐక్యంగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. తమ ఉద్యమం వల్లే ఆరోగ్యశ్రీ, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి 6 కిలోల బియ్యం, దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్, వితంతువులు, వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ అమలవుతుందన్నారు.

29 ఏళ్ల సుదీర్ఘ పోరాట పయనంలో ఎన్నో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు లక్షలాది మందిని కూడగట్టి చేపట్టిన చరిత్ర ఎంఆర్ పీఎస్ ఉద్యమానికుందని, అదే స్ఫూర్తి, ఒరవడి, పోరాట పటిమతో హైదరాబాద్ లో జరుగనున్న మాదిగల విశ్వరూప మహాసభ దిక్కులు పిక్కట్టిల్లేలా…దేశం, ప్రపంచమంతా…మన వైపు చూసేలా ఉండి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు ప్రతి మాదిగ బిడ్డ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంగ్రామ అంకంలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. జాతిని జాగృతం చేసి విశ్వ రూప సభకు దండోరా దండు కదలాలని, మునుపెన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో విజయవంతం చేయాలని విశ్వ రూపసభకు హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఎంజేఎఫ్ జాతీయ ఇంచార్జీ తిప్పారపు లక్ష్మణ్, జాతీయ సలహాదారులు దేవేందర్ , రాష్ట్ర అధ్యక్షులు సుంచు అశోక్, కోశాధికారి సాయి రమేష్, హైదరాబాద్ అధ్యక్షులు గజ్జెల వీరేశం, గాదె రమేష్, చెరుకుపల్లి శ్రీనివాస్, అమరవరపు కోటేశ్వరరావు,  రామడుగు వెంకట్, వెంకటేశ్వర్లు, చెంగపంగు సైదులు, దేవ కుమార్, యర్ర యాకయ్య, డప్పు రామస్వామి, జీడిమెట్ల రవీందర్, రామకృష్ణ, నాగేశ్ వర్మ, సైదులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, సమన్వయ కర్తలు జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర నూతన సారథిగా గాదె రమేష్ తో పాటు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking