బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా
విడుదల చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. కేవలం 7 మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. అలాగే తాను కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.