అతి త్వరలోనే ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు

అతి త్వరలోనే ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు

కాలనీ వాసుల కలలు సాకారం చేసిన

లారీల బెడద నుండి పూర్తి విముక్తి

ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :

ఆటో నగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు భాగంగా ఆదివారం ఆటో నగర్ లోపల ఉన్న స్థలాన్ని టీ.ఎస్.ఐ.ఐ.సీ. (TSIIC) ఏం.డీ. నర్సింహారెడ్డి ఎల్.బి నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి ఆటోనగర్ లోపల ఉన్న ఐలా స్థలాన్ని పరిశీలించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఇట్టి ఇసుక లారీల అడ్డా వల్ల దాదాపు చుట్టుపక్కల ఉన్న15 కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా వారు వచ్చి ఇక్కడ ఉన్న దాదాపు 11 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు .గతంలో నేనే ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తరలించాలని ప్రతిపాదనలు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం వారిని కలిసి ఆటో నగర్ లోని లారీల అడ్డా గురించి వివరించిన నేపథ్యంలో వారు రావడం జరిగింది అని సుధీర్ రెడ్డి తెలిపారు .ఏ స్థలం అనుగుణంగా ఉంటే అట్టి స్థలంలోకి అట్టి ఇసుక లారీల అడ్డాను తరలించడం జరుగుతుంది అని తెలిపారు. అతి త్వరలోనే లారీల బెడద నుండి ప్రజలకు పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు. రాబోయే రోజుల్లో రోడ్డు మీద ఇసుక లారీలు ఆగకుండా చూసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే అట్టి స్థలంలో వారికి కనీస సౌకర్యాలు అయిన మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు, పడుకోవడానికి తగిన వసతులు కల్పించడం జరుగుతుంది అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రధానమైన సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తాము అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఐలా జోనల్ మేనేజర్ రవి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి  పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking