కొత్తగూడెంలో గడప గడపకు గడల


కొత్తగూడెంలో గడప గడపకు గడల


-గడపగడపకు గడల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత మహిళలు

భద్రాద్రి/ అక్షిత బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం తొలి రోజు గడపగడపకు గడల కార్యక్రమం ప్రారంభమైంది. గడప గడపకు గడల  ఇంటింటికి కొడుకులా  నినాదంతో జిఎస్సార్ ట్రస్ట్ అధినేత రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు  ప్రారంభించిన  కార్యక్రమం తొలి రోజు సూపర్ హిట్ అయింది.సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

23 వార్డ్ సూర్యోదయ స్కూల్ తమ స్వగృహము నుండి మేళ తాళాలతో కార్యక్రమం ప్రారంభించారు.వార్డ్ లో దారి పొడవున ఇళ్ల వద్ద పలువురు మహిళలు ఎదురేగి గడలకు బొట్టు పెట్టి హారతులతో స్వాగతం పలికారు. కొందరు  హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించి దీవించారు.ఓ అన్న లా ఓ కొడుకుల  తమ తొడబుట్టినోడిలా ఆదరించారు.వార్డులో కార్యక్రమం ఉత్సాహపూరితంగా కొనసాగింది.గాయత్రి హాస్పిటల్ లో డాక్టర్ అల్లూరి నాగరాజు వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి గడల శ్రీనివాసరావు దీవెనలు అందుకున్నారు. వార్డ్ లోఖ ఒకచోట చిన్నపిల్లలు గడలకు హారతి పట్టి బొట్టు పెట్టి దీవించారు.అలాగే సిఎస్ మెమోరియల్ ఆసుపత్రిలో డాక్టర్లను కలిసి వచ్చారు. ఇలా గడపగడపకు వెళ్తూ అందరినీ గడల ఆకట్టుకున్నారు. గడల జిందాబాద్… గడల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ జిఎస్ ఆర్ యువసేన సభ్యులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి మహిళను అమ్మా, అక్కా చెల్లి అంటూ పలకరిస్తూ గడలకు మహిళల్లో  ఓ తొడబుట్టినోడుగా ఓ కొడుకులా మహిళలు ఆదరించారు దీవించారు. ఈ కార్యక్రమంలో  సొసైటి  వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ పటేల్, మోదుగు జోగారావు, తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking