మీరే నా బలం… మీరే నా బలగం

 

మీరే నా బలం… మీరే నా బలగం

మరోసారి ఆశీర్వదించండి ఐదేళ్లు నియోజకవర్గ సేవకుడిగా పని చేస్తా

అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ ని మరోసారి ఎంపిక

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్షిత ప్రతినిధి :

అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ని మరోసారి ఎంపిక చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ జాతిపిత కెసిఆర్ కి  స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేటలో నిన్న జరిగిన ప్రగతి నివేదన సభలో మరోసారి టికెట్ కన్ఫామ్ చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే మళ్ళీ తనకు రెండోసారి టికెట్ రావడం జరిగిందని మరోసారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ఆదరాభిమానాలు చూపించాలని నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కోదాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking