కాంగ్రెస్ హయాంలోనే పేదలకు లబ్ధి..

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు లబ్ధి..

కెసిఆర్ హఠావో తెలంగాణ బచావో 

రామన్నపేటలో ఇంటింటికి కరపత్రాల పంపిణీ

ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలి

అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్దే

ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యం

మోసపూరిత హామీలకు లోను కావద్దు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
నలగాటి ప్రసన్న రాజ్ వెల్లడి

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీ హాయంలోనే పేదలకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజు అన్నారు. సోము సోమవారం స్థానిక రహదారి బంగ్లాల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పిలుపుమేరకు కెసిఆర్ హటావో తెలంగాణ బచావో గ్రామ గ్రామాన ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంబంధ వర్గాల పోరాటం ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో నియామకాల అమలులో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేదలకు లబ్ధి చేకూరకుండా ధనిక రాష్ట్రంగా ఏర్పడిందని అన్నారు. బీహార్ సాయం లో నిరుపేదలకు ఇండ్లు కలగానే మిగిలాయని, రైతుబంధు పెత్తందారులకే లబ్ధి చేకూరిందని అన్నారు. గృహలక్ష్మి పథకం అమలు పట్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దళిత బంధు బీసీ బంధులో టిఆర్ఎస్ కార్యకర్తలకు లబ్ధి చేకూరిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టేలా ప్రజలను చైతన్య పరుస్తామని అన్నారు. ఇందిరాగాంధీ హాయంలో పెదలకు ఇచ్చిన భూములను లాక్కోవడం హేయమైన చర్య అని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకొని అందరికి లబ్ధి చేకూరేలా మారుస్తామన్నారు. లేని పోని పథకాలను ఆశ చూపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తెచ్చిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు. మోసపూరిత పథకాలను ఆశ చూపి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. నాయకులు గురుకుశివ, నోముల మారయ్య,గొర్ల యాదయ్య,నరసింహ యాదగిరి సైదులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking