ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
కలెక్టర్ ఆర్ వి కర్ణన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
వర్షా భావ పరిస్థితులు, ఎన్.ఎస్.పి.ద్వారా సాగు నీరు కొరత ఉన్నందున వరి విస్తీర్ణం సాగు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గే అవకాశం ఉన్నందున,గ్యాప్ లేకుండా
వరికి ప్రత్యామ్నాయoగా కంది పెసర,మినుము, బొబ్బర్లు,కూరగాయల సాగు,పచ్చి రొట్టె ఎరువులు, పశు పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ హార్టికల్చర్ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని ఉదయాత్య భవన్లో వ్యవసాయ, హార్టికల్చర్, సెరికల్చర్, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ,ఉద్యాన,మత్స్య శాఖ, పశు సంవర్టక శాఖ లు సమన్వయం తో పని చేసి రైతులకు సేవలు అందించాలని అన్నారు. వరి, అనుబంధ రంగాలలో సాగు పద్ధతులలో నూతన విధానాలను అవలంబిం చాలని ఆయన తెలిపారు.వరి సాగు గ్యాప్ ఉన్న విస్తీర్ణం లో ఇతర పంటల సాగుకు ప్రత్యేక యాక్షన్ ప్రణాళికని సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఎంతమంది ఏవోలు, ఎంఏవోలు ఉన్నారని జెడిని అడగగా, 140 మంది ఏవోలు, 30 మంది ఎంఏవోలు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు ఎంత మొత్తంలో ఎరువులు సప్లై చేశారు. ఎంత మొత్తం స్టాకు నిల్వ ఉన్నది. ఇంకా ఎంత మొత్తం ఎరువులు కావాల్సి ఉందని తెలుసుకున్నారు. 2023-24కు రైతు బీమా కింద 2,88,628 మంది నమోదు జరిగినట్లు తెలిపారు. రైతు బీమా ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యము అందరికీ అందేలా చూడాలని అధికారులను ఆయన కోరారు. రైతుబంధు ద్వారా రైతుకు పెట్టుబడి సాయంగా ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలుసుకున్నారు.

ఇప్పటి వరకు రైతులకు 460 కోట్ల రుణమాఫీ జరిగిందని అన్నారు. ఆర్ ఎఫ్ ఆర్ ల్యాండ్ వివరాలు దేవరకొండ, చందంపేట ప్రాంతాల గురించి ప్రశ్నించారు. ఆర్ ఎఫ్ అర్ ల్యండు లో కాటన్ వంటి పంటలను పండించడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. హార్టికల్చర్ క్రాపు వైస్ వివరాలు అడిగారు. ఆయిల్ ఫామ్ మొక్కల వివరాలు, నర్సరీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ ఎకరాకు 57 మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. పశుసవర్ధక శాఖ ఆసుపత్రులలో ఏ ఏ సేవలు అందిస్తున్నారని ప్రశ్నించారు. ల్యాబ్లోఎన్ని టెస్టులు చేస్తున్నారు. ఏ ఏ టెస్టులు చేస్తున్నారు. ఆయా వాటికి సంబంధిత కిట్లు అందుబాటులో ఉన్నాయా అని తెలుసుకున్నారు. డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇన్చార్జి గురించి అడిగారు. వెటర్నరీ డిస్పెన్సరీ, రూరల్ లైవ్ స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్య శాఖపై సమీక్షించారు.మత్స్య శాఖ పథకాల పై అవగాహన కలిగించాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి సుచరిత, మత్స్య శాఖ వెంకయ్య, ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మీ, పశు సoవర్ధక శాఖ అధికారి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.